
పిల్లల దత్తతలో నిబంధనలు పాటించాలి
పోస్టర్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్
తుమ్మపాల: అనాథ పిల్లలను చట్టపరమైన నిబంధనల మేరకు దత్తత తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. ‘మాతృత్వం ఒక వరం..దత్తత అందుకు మరో మార్గం’పోస్టర్‌ను జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఆమె సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 0 నుంచి 18 సంవత్సరాల పిల్లల దత్తతను వెబ్‌సైట్ http:// WWW.CARA.NIC.IN ద్వారా చట్టపరంగా తీసుకోవాలన్నారు. ఏ విధమైన సందేహాలు ఉన్నా జిల్లా బాలల సంరక్షణ విభాగంలో సంప్రదించాలన్నారు. పిల్లల దత్తతకు సంబంధించిన మరింత సమాచారం కోసం జిల్లా బాలల సంరక్షణ రక్షణ అధికారి ఫోన్ నంబర్ 89789 17154, పరిరక్షణ అధికారి ఫోన్ నంబర్ 85008 96656లో సంప్రదించాలన్నారు.