
క్వారీ బాధితుల వినూత్న నిరసన
గాంధీ విగ్రహం వద్ద కళ్లకు గంతులతో
నిరసన తెలుపుతున్న క్వారీ బాధితులు
నర్సీపట్నం: మాకవరపాలెం మండలం జి.కోడూరు క్వారీ బాధితులు మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద కొనసాగుతున్న నిరాహార దీక్ష శిబి రం నుంచి ర్యాలీగా మున్సిపల్ స్టేడియంలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని క్వారీ అనుమతులు రద్దు చేయాల ని నినాదాలు చేశారు. బీఎస్పీ నాయకుడు బొట్టా నాగరాజు, కాంగ్రెస్ నాయకుడు బొంతు రమణ మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెక్‌పోస్టులు పెట్టించడం కాదు, ముందు క్వారీ వాహనాలను ఆపితే చెక్‌పోస్టులు అవసరం లేదన్నారు. బాధిత రైతులకు స్పీకర్ న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకుడు ఈరెల్లి చిరంజీవి, వైఎస్సార్ సీపీ నాయకుడు మట్ల చంటిబాబు, బాధితులు పాల్గొన్నారు.