
కల్యాణపులోవ రిజర్వాయర్ నీరు విడుదల
రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే రాజు, తదితరులు
రావికమతం: మంటలంలో చీమలపాడు పంచాయతీ కల్యాణపులోవ రిజర్వాయర్ నుంచి సాగునీటిని చోడవరం ఎమ్మెల్యే రాజు మంగళవారం విడుదల చేశారు. రోజూ 50 క్యూసెక్కుల నీటిని ఆయకట్టు ద్వారా విడుదల చేస్తామని, ప్రస్తుతం ఈ నీటిని నారుమడులకు మాత్రమే రైతులు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం పెద్దేరు కాలువలో పూడిక తీత పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ బాల సూర్యం, ఏఈ సూర్య, ఆయకట్టు చైర్మన్ బంటు రామునాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు కోమటి శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు.