ఈత కొలనులో మునిగి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ఈత కొలనులో మునిగి యువకుడి మృతి

Aug 6 2025 7:43 AM | Updated on Aug 6 2025 7:43 AM

ఈత కొలనులో మునిగి యువకుడి మృతి

ఈత కొలనులో మునిగి యువకుడి మృతి

అచ్యుతాపురం రూరల్‌/కశింకోట: కశింకోట: స్థానిక గవరపేటలో ఆశా కార్యకర్త ఇంట విషాదం నెలకొంది. ఆశా కార్యకర్త సవరాల పార్వతి ఏకై క కుమారుడు భాస్కరరావు(25) గాజువాకలోని సెలూన్‌ షాపులో ఇటీవల చేరాడు. మంగళవారం దుకాణాలకు సెలవు కావడంతో స్నేహితులతో కొండకర్ల వద్ద ఓ రిసార్టుకు వెళ్లాడు. అక్కడ స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని అనకాపల్లి ఎన్‌టీఆర్‌ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని అచ్యుతాపురం సీఐ నమ్మి గణేష్‌ తెలిపారు. భాస్కరరావు మృతితో కశింకోటలో విషాదం అలుముకుంది. తనకు అండగా ఉండి జీవితాంతం ఆదుకుంటాడనుకున్న ఏకై క కుమారుడు మృతితో తల్లి పార్వతి కన్నీరు మున్నీరుగా విలపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement