
ఘన వ్యర్థాల నిర్వహణతో సంపద సృష్టి
మార్టూరు సంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: ఘన వ్యర్థాల నిర్వహణతో పర్యావరణ పరిరక్షణతో పాటు, పునర్వినియోగం ద్వారా సంపద సృష్టించవచ్చని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. మండలంలో మార్టూరు గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణపై మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంట్లోని చెత్తను తడి, పొడిగా విడదీసి అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఘన వ్యర్థాలను పునర్వినియోగానికి వినియోగించే విధంగా వేరు చేసి అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌డీవో నాగలక్ష్మి, సీపీవో రామారావు, సర్పంచ్ కరణం రెవెన్యూనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.