
సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్ర ర్యాలీ
కశింకోట: ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించిన సైనికులకు సంఘీభావంగా కశింకోటలో మాజీ సైనికోద్యోగులు, నాయకు లు, అభిమానులు తిరంగా యాత్ర ర్యాలీని ఆదివారం నిర్వహించారు. జాతీయ పతాకాలతో స్థానిక పెద బజారు నుంచి ప్రారంభించిన ప్రదర్శన సంతబయల మీదుగా జాతీయ రహదారి కూడలి వరకు ప్రధాన పంచాయతీ రహదారి మీదుగా సాగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, మాజీ సైనికోద్యోగుల సంఘం అధ్యక్షుడు గొంతిన రమణ, నాయకులు దాసరి బాబు, సిదిరెడ్డి శ్రీనివాసరావు, ప్రగఢ నూకరాజు, శిష్టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.