ఉపాధి కల్పించకుంటే మా గతేంటి? | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కల్పించకుంటే మా గతేంటి?

May 29 2025 7:11 AM | Updated on May 29 2025 7:11 AM

ఉపాధి

ఉపాధి కల్పించకుంటే మా గతేంటి?

● స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ఆవేదన

● కొనసాగిన అడ్మిన్‌ ముట్టడి.. స్వల్ప ఉద్రిక్తత

ఉక్కునగరం(విశాఖ): ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నామని, ఉపాధి కల్పించకపోతే తమ కుటుంబాల గతేంటని స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండవ రోజు బుధవారం జరిగిన ఉక్కు అడ్మిన్‌ ముట్టడి కార్యక్రమంలో అధికారులు, పోలీసుల వద్దకు వెళ్లి కాంట్రాక్ట్‌ కార్మికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం గేట్ల దిగ్బంధానికి కార్మికులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అడ్మిన్‌ భవనం వద్దకు చేరుకున్నారు. ఒకేసారి బిల్డింగ్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాస్త తోపులాట నెలకొంది. పోలీసులు పదే పదే చెప్పినప్పటికీ కార్మికులు పోలీసు వలయాన్ని దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంత మంది కింద పడిపోయారు. దీంతో యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంత కాలం పనిచేసిన తమను తీసేస్తే తమ కుటుంబాల గతేంటని ప్రశ్నించారు. సాయంత్రం వరకు అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గురు, శుక్రవారాలు కూర్మన్నపాలెం దీక్షా శిబిరం వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. శుక్రవారం రీజనల్‌ లేబర్‌ కమిషన్‌ చర్యల అనంతరం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ముట్టడిలో పాల్గొన్న నాయకులపై కేసు నమోదు

ఉక్కు అడ్మిన్‌ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులపై స్టీల్‌ప్లాంట్‌ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ రాజభాష విభాగం జీఎం లలన్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు వివరాలిలా ఉన్నవి. ఈనెల 20 నుంచి జరుగుతున్న స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల నిరవధిక సమ్మె నేపథ్యంలో 27, 28 తేదీల్లో కాంట్రాక్ట్‌ కార్మిక సంఘాలు అడ్మిన్‌ బిల్డింగ్‌ ముట్టడి చేపట్టాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు, కార్పొరేటర్‌ గంగారావు, సత్యనారాయణ, కె.ఎం.శ్రీనివాస్‌, సీఐటీయూ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ కార్యదర్శి నమ్మి రమణ, జి.శ్రీనివాస్‌, ఆర్‌.టి.రాజుతో పాటు సుమారు 200 కాంట్రాక్ట్‌ కార్మికులు ధర్నాలు చేసి రాకపోకలు సాగించే ఉద్యోగులకు ఇబ్బందులు కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఉపాధి కల్పించకుంటే మా గతేంటి? 1
1/1

ఉపాధి కల్పించకుంటే మా గతేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement