వేట సాగదు...పూట గడవదు.. | - | Sakshi
Sakshi News home page

వేట సాగదు...పూట గడవదు..

Jun 5 2025 8:10 AM | Updated on Jun 5 2025 8:10 AM

వేట స

వేట సాగదు...పూట గడవదు..

గొలుగొండ : వందలాది మంది జాలర్లకు అన్నం పెట్టే తాండవ జలాశయం ఈ వేసవిలో జాలర్లకు నిరాశే మిగిల్చింది. ప్రతి ఏటా వేసవి వచ్చిందంటే జాలర్లకు కాసుల పంట పండేది. కానీ ఏ ఏడాది దాదాపుగా 15 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా వేసవిలో రొయ్యల వేట చాలా మందకొడిగా సాగుతోందని జాలర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రతి ఏటా వేసవిలో రొయ్యల వేట జలాశయంలో ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తే ఈ ఏడాది మే నెలలో భారీ వర్షాలు కురిసి రొయ్యల వేటకు ఇబ్బందులు కలిగించాయి.

500 మందికి జీవనోపాధి...

తాండవ జలాశయంలో 500 మంది వరకు జాలర్లు ప్రతి ఏటా రొయ్యల వేట సాగింస్తుంటారు. మత్య్సకారుల సంఘం ఆధీనంలో ఈ రొయ్యల వేట నిర్వహించి జీవనోపాధి పొందుతారు. ప్రతి ఏటా ఏప్రిల్‌లో సంఘం ఆధ్వర్యంలో రొయ్యల వేట నిర్వహించి జూన్‌ రెండవ వారంలో వేటను నిలుపుదల చేస్తారు. సుమారుగా 50 రోజుల పాటు రొయ్యల వేట నిర్వహించే సమయంలో ప్రతి జాలరికి ప్రతిరోజు రూ.1500 వరకు ఆదాయం వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు, అలాగే రాత్రి సమయంలోనూ వేట నిర్వహించి జీవనోపాధి పొందుతారు. అయితే ఈ ఏడాది ఈ పరిస్థితి లేకుండా పోయింది.

ఎండల సమయంలో వర్షాలు

తాండవ జలాశయం సుమారుగా 4వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. తాండవ జలాశయం చుట్టూ వెంకటాపురం, పొగచెట్లపాలెం, గొలుగొండ, జోగుంపేట, సాలికమల్లవరం, అమ్మపేట, గాదంపాలెం, జలార్లుపేట, జాలర్లుపేట, కొత్తమల్లంపేట తదితర గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో లైసెన్సులు ఉన్న వారు సుమారుగా 200 మంది జాలర్లు కాగా మరో 300 వందల మంది వరకు అనుభవం ఉన్న జాలర్లు రొయ్యల వేట నిర్వహిస్తారు. ప్రతి ఏటా మత్స్యకారల సంఘం ప్రతినిధులు, మత్య్సశాఖ ఆద్వర్యంలో ఏఫ్రిల్‌ నెలలో రొయ్యల వేట సాగించి జూన్‌ రెండవ వారంలో నిలుపుదల చేస్తారు. వేడి తీవ్రత ఆధికంగా ఉండడం వల్ల రొయ్యలు జలాశయం నుంచి బయటకు వచ్చే సమయంలో వేట సులువుగా జరుగుతుంది. కానీ ఏ ఏడాది మే నెల అంతా భారీ వర్షాలు, తుఫాన్ల ప్రభావం వల్ల రొయ్య జలార్లకు చిక్కలేదు. రొయ్యల కోసం బిందులు, వల లు వేసుకొని జలాశయంలోకి వెళ్లి ప్రయ త్నాలు చేసినా అనుకున్నంత ఫలితం దక్కలేదు. మరో 10 రోజుల్లో రొయ్యల వేట నిలుపుదల చేయడం జరుగుతుందని, కానీ ఇప్పటి వరకూ సరిగా వేట సాగ లేదని ఆవేదన చెందుతున్నారు.

ఈ ఏడాది నిరాశే...

గడిచిన 15 సంవత్సరాల చరిత్రలో ఈ ఏడాది మే నెలలో భారీ వర్షాలు కురిసాయి. దీంతో రొయ్యల వేట జరగడం చాలా కష్టతరంగా మారింది. మే నెలలో రొయ్యల వేటకు వెళ్లిన సందర్భంగా గాలులు, వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాం. చేపల వేట కన్నా రొయ్యల వేట 50 రోజుల్లో మంచి ఆదాయం అందిస్తుంది. కానీ ఈ ఏడాది నిరాశే మిగిలింది. మరో 10 రోజుల్లో రొయ్యల వేట నిలిచిపోతుంది.

– రాజు, మత్స్యకారుడు, వెంకటాపురం

తాండవ జలాశయంలో

రొయ్యల వేటకు ఇబ్బందులు

అధిక వర్షాలే కారణం

వేట సాగదు...పూట గడవదు.. 1
1/2

వేట సాగదు...పూట గడవదు..

వేట సాగదు...పూట గడవదు.. 2
2/2

వేట సాగదు...పూట గడవదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement