తారాబు సందడి | - | Sakshi
Sakshi News home page

తారాబు సందడి

Oct 5 2026 12:27 AM | Updated on Oct 5 2026 12:27 AM

పెదబయలు: వీకెండ్‌ కావడంతో మండలంలోని జామిగుడ, గిన్నెలకోట పంచాయతీల సరిహద్దు ప్రాంతాల్లోని పిట్టలబొర్ర (తారాబు) జలపాతం ఆదివారం పర్యాటకులతో కిటకిలలాడింది. ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఉదయం నుంచే తరలివచ్చారు. జాలువారే జలపాత అందాలను తిలకిస్తూ రోజంతా ఉల్లాసంగా గడిపారు.

మెరుగైన రవాణా సదుపాయాలు

గతంలో గిన్నెలకోట–జామిగుడ వరకు తారురోడ్డు సదుపాయం కల్పించడంతో పర్యాకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఇటీవల అరకు ఎంపీ తారాబు జలపాతాన్ని సందర్శించి, జలపాత సహజ అందాలకు ఎలాంటి భంగం కలగకుండా గ్లాస్‌ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, పర్యాటకుల సౌకర్యార్థం అన్ని సదుపాయాలు

కల్పించేందుకు రూ.5 కోట్ల ఎంపీ నిధులతో అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడంతో... ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగింది.

పోటెత్తిన ఇతర రాష్ట్రాల పర్యాటకులు

జామిగుడ మీదుగా, భూషిపుట్టు నుంచి పిట్టల

బొర్ర గ్రామం మీదుగా జలపాతానికి దారి ఉండటంతో, చాలా నెలల తర్వాత ఈ ప్రాంతం పర్యాటకులతో కళకళలాడింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రా ష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement