గాయపడిన వ్యక్తి చికిత్సపొందుతూ మృతి | - | Sakshi
Sakshi News home page

గాయపడిన వ్యక్తి చికిత్సపొందుతూ మృతి

Oct 5 2026 12:27 AM | Updated on Oct 5 2026 12:27 AM

ముంచంగిపుట్టు: మండలంలో ఏనుగురాయి పంచాయతీ కొండపడ గ్రామ సమీపంలో బైక్‌ను గుర్తుతెలియని ఆటో ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిల్లో బోల్‌దాసు (32) ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ ఆదివారం తెల్లవారుజామున పాడేరు జిల్లా ఆసుపత్రిలో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం బోల్‌దాసు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయన మృతితో స్వగ్రామమైన జర్రెలలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితోనూ ఎంతో కలివిడిగా ఉండే వ్యక్తి ఇలా అర్ధంతరంగా తనువు చాలించడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుడి భార్య రత్నకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమై ఆపకుండా వెళ్లిపోయిన ఆటో డ్రైవర్‌ శోభ వెంకటరమణను.. ఎస్‌ఐ నాని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. నిందితుడు వెంకటరమణను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో పాటు, ప్రమాదానికి కారణమైన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement