బకాయిలతో ఉద్యోగులకు అందని వైద్యం | - | Sakshi
Sakshi News home page

బకాయిలతో ఉద్యోగులకు అందని వైద్యం

Oct 4 2026 11:43 AM | Updated on Oct 4 2026 11:43 AM

● ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు

నర్సీపట్నం: ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ బకాయిలు పేరుకుపోవడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందటం లేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు వాపోయారు. శనివారం నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వ వాటా, ఉపాధ్యాయుల వాటాను నేరుగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు జమయ్యేటట్లు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. పది రోజుల్లో హాస్పిటళ్లకు బిల్లులు చెల్లింపులు జరుగుతాయన్నారు. ఉద్యోగ సంఘాల చెల్లింపుల్లో 15 శాతం డిడక్షన్‌ చేసినట్లయితే అన్‌లిమిటెడ్‌ వైద్య సదుపాయాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్‌ ఏర్పాటు మార్గం సుగమమైందన్నారు. స్కూల్‌ అసిస్టెంట్లు హెచ్‌ఎం(గ్రేడ్‌–2) జోనల్‌ క్యాడర్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం వల్ల దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఏకీకృత సర్వీసు రూల్స్‌కు మోక్షం లభించిందన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్‌, జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు కురసా రమణ, మండల అధ్యక్షుడు అడిగర్ల వరహాలనాయుడు, జిల్లా కార్యదర్శి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement