చింతపల్లి: విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు కనీస సౌకర్యాలను అందుబాటులో ఉంచే విధంగా పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని తహసీల్దారు, పాఠశాల ప్రత్యేక అధికారిణి హనుమంతు త్రివేణి అన్నారు. శనివారం ఆమె వంగసార గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యాబోధన, పాఠశాల ప్రాంగణ పరిశుభ్రత, భోజన వసతి వంటి పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నేరుగా విద్యార్థినులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు పలాసి ప్రసాద్, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.


