పాఠశాలలు, హాస్టళ్లలో దుర్భర పరిస్థితులు | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలు, హాస్టళ్లలో దుర్భర పరిస్థితులు

Oct 4 2026 11:43 AM | Updated on Oct 4 2026 11:43 AM

పాడేరు రూరల్‌: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు పశువుల శాలల కంటే హీనంగా తయారయ్యాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీవన్‌, కార్తీక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. జాతీయ కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్‌ 21 నుండి అక్టోబర్‌ 2 వరకు జిల్లా వ్యాప్తంగా 45 పాఠశాలలు, కళాశాలలను సందర్శించి 11,819 మంది విద్యార్థులను కలుసుకుని సర్వే నిర్వహించినట్లు తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాల్లో కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, రన్నింగ్‌ వాటర్‌, త్రాగునీరు, ప్రహరీలు, ఫ్యాన్లు, విద్యుత్‌, తలుపులు, కిటికీలు లేవన్నారు. పారిశుధ్యం లోపించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు కాకపోవడం, పౌష్టికాహారం అందకపోవడంతో విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు రక్తహీనత బారిన పడుతున్నారని ఆరోపించారు. ఏటీడబ్ల్యూవోలు, ఎంఈవోల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని సర్వేలో తేలిందన్నారు. అధికారులు స్పందించి గిరిజన విద్యాలయాల్లో మౌలిక వసతులు, మెనూ అమలును మెరుగుపరచాలని, లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నారావు, నాయకులు పౌల్‌, చందు తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు

జీవన్‌, కార్తీక్‌ ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement