‘ఉపాధి’ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతాం | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతాం

Oct 4 2026 11:43 AM | Updated on Oct 4 2026 11:43 AM

● పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీజిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు

పాడేరు: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు. శనివారం పాడేరులో ఉపాధి హామీ (వీబీజీఆర్‌ఎం) ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సిబ్బంది ఆయన్ను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. గత 19 ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, నెలకు కేవలం రూ. 5,745 మాత్రమే వేతనం ఇస్తున్నారని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా సమస్యలను పట్టించుకోలేదని, పని ఒత్తిడి, చాలీచాలని జీతాల కారణంగా కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలోనూ, బయటా గళం విప్పుతామని, వారు చేపట్టే ప్రతి పోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement