గురుపౌర్ణమి వేళవిరబూసిన బ్రహ్మకమలాలు | - | Sakshi
Sakshi News home page

గురుపౌర్ణమి వేళవిరబూసిన బ్రహ్మకమలాలు

Jul 30 2026 1:21 AM | Updated on Jul 30 2026 1:21 AM

దివ్య సౌందర్యాన్ని తిలకించిన భక్తులు, ప్రకృతి ప్రేమికులు

చింతపల్లి: గురుపౌర్ణమి పర్వదినాన మండల కేంద్రం చింతపల్లిలో ఒకేసారి మూడు బ్రహ్మకమలాలు వికసించి అందరినీ ఆకట్టుకున్నాయి. స్థానిక రాజమ్మగరువులో నివాసముంటున్న ఉప్పల బంగారయ్యశెట్టి ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో మూడు బ్రహ్మకమలాలు విరబూసి కనువిందు చేశాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, భక్తులు, ప్రకృతి ప్రేమికులు ఈ అరుదైన దివ్య పుష్పాలను తిలకించి పరవశించారు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే, అదీ అనుకూల వాతావరణ పరిస్థితుల్లో వికసించే బ్రహ్మకమలం గురుపౌర్ణమి రోజున పూయడం ఎంతో శుభసూచకమని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement