పాడేరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఈవీఎం గోదాములను జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ బుధవారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ తదితర రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన గదులను క్షుణ్నంగా తనిఖీ చేశారు. గదులకు అమర్చిన సీళ్లను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది, పోలీసులకు అవసరమైన సూచనలు చేసి, అనంతరం విజిటింగ్ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ తనిఖీల్లో ఇన్‌చార్జి డీఆర్వో ఎంవీఎస్ లోకేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బూటరీ వెంకటరావు, టీడీపీ ప్రతినిధి బుద్దా జ్యోతీకిరణ్, కాంగ్రెస్ ప్రతినిధి రంజిత్, మండల ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణమూర్తి, ఎన్నికల కోఆర్డినేషన్ సూపరింటెండెంట్ కుమారస్వామి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


