విశాఖ స్పోర్ట్స్: హైఫై ప్రీమియర్ క్రికెట్ లీగ్ రైల్వే స్టేడియంలో బుధవారం ప్రారంభమైంది. టెన్నిస్‌బాల్‌తో పదిహేను ఓవర్లు ఇన్నింగ్స్‌గా సాగే మ్యాచ్‌ల్లో ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. ఆరంభ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మణికంఠ సూపర్ కింగ్స్ ఐదు వికెట్లకు 148 పరుగులు చేసింది. ప్రతిగా వైజాగ్ టైటాన్స్ ఐదు వికెట్లకు 131 పరుగులే చేసి పదిహేడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రెండో మ్యాచ్‌లో టాస్ ఓడితొలుత బ్యాటింగ్ చేసిన యునిఖ్ స్ట్రయికర్స్ తొమ్మిది వికెట్లకు 130 పరుగులు చేయగా విబి కన్వెన్సన్స్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 113 పరుగులే చేసింది. మూడో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గాదిరాజు ఎలెవెన్ 11.3 ఓవర్లలోనే 50 పరుగులకు ఆలౌట్ కాగా ప్రతిగా ఈవెంట్ హౌజ్ ఫాల్కన్స్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసి విజయం సాధించింది. ఈవెంట్ మేనేజర్లు, కళాకారులు, సాంకేతిక నిపుణులు, క్యాటరర్స్‌తో కూడిన ఎనిమిది జట్లు ఈ టోర్నిలో పోటీపడుతున్నాయి. టోర్నీ ఫైనల్స్ 4వ తేదీన జరగనుంది. రైల్వే స్టేడియంలో బుధవారం రైల్వే డీఎఫ్‌ఎం హరినాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరక్టర్ రాజా, నిర్వాహక ప్రతినిధులు లింగేశ్వరరావు, అరుణ్‌కుమార్, జిఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.


