గొలుగొండ: సాలికమల్లవరం మాజీ సర్పంచ్ పెదిరెడ్ల లక్ష్మిపై స్థానిక తెలుగుదేశం నాయకులు దాడి చేసి 24 గంటలైనా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కొరుప్రోలు పాణిశాంతారామ్, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత అన్నారు. అధికారం ఉందని తెలుగుదేశం నాయకులు మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని, వారికి అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు గొలుగొండ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి... టీడీపీ నాయకులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ అప్పారావు మాట్లాడుతూ ఎస్‌ఐ రామారావు బందోబ స్తులో ఉన్నారని, ఆయన వచ్చే వరకూ రెండు వర్గాలపై బైండవర్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సమస్యను నర్సీపట్నం డివిజన్ స్థాయి పోలీసులకు తెలియజేశామని, ఎస్‌ఐ వచ్చిన తరువాత తహసీల్దార్ కోర్టులో రెండు వర్గాల వారిని హాజరుపరుస్తామని చెప్పారు.పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన వారిలో వైఎస్ ఎంపీపీ సుర్ల బాబ్జి, నాయకులు నల్లబెల్లి శ్రీను, యలమంచిలి రఘురాం, సత్యంనా యుడు, బుల్లిప్రసాద్, లోవ, శ్రీను, హరీష్ ఉన్నారు.


