మెగా మోసం | - | Sakshi
Sakshi News home page

మెగా మోసం

Jun 2 2026 3:18 AM | Updated on Jun 2 2026 3:18 AM

మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్‌ శ్రీ 2026
దగా డీఎస్సీ..
అనర్హులకు టీచర్‌ పోస్టులు ఇవ్వడం దారుణం మంత్రి లోకేష్‌ను బర్తరఫ్‌ చేయాలి సీబీఐతో విచారణ జరపాలి కలెక్టరేట్‌ వద్ద భారీ ఎత్తున ఆందోళన న్యాయం జరగని పక్షంలో ఆందోళనలు ఉధృతం వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగం నేతల హెచ్చరిక

దగా డీఎస్సీపై సాగుతున్న పోరు సమర భేరిగా మార్మోగింది. నిరసన నినాదాలు దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించాయి. అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

అర్హులైన ఎస్టీ నాయక్‌లకు కులధ్రువీకరణ పత్రాలు

జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ

సాక్షి,పాడేరు:జిల్లాలోని అర్హులైన ఎస్టీ నాయక్‌ సామాజిక వర్గానికి నిబంధనలను ప్రకారం కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో 8,883 ఎస్టీ నాయక్‌ కుటుంబాలు నివసిస్తున్నాయని పేర్కొన్నారు.ఈ సామాజిక వర్గానికి చెందిన వారు అవసరమైన అన్ని ఆధారాలు, వివరాలతో తమ పరిధిలోని గ్రామ సచివాలయాల ద్వారా సంబంధిత మండల తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సచివాలయం,తహసీల్దార్‌స్థాయి పరిశీలన అనంతరం సబ్‌కలెక్టర్‌ తుది ఆమోదంతో ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం జూన్‌లో మొదట విడతలో పాఠశాల,కళాశాల విద్యార్థులు,కొత్తగా ఉద్యోగాల కోసం నమోదు చేసుకునే నిరుద్యోగులకు, జూలైలో మిగిలిన కుటుంబ సభ్యులకు కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ జారీ చేస్తామని తెలిపారు. ఎస్టీ నాయక్‌ సామాజిక వర్గం ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

సాక్షి,పాడేరు: టీచర్‌ పోస్టులను అమ్ముకుని అర్హులకు అన్యాయం చేసిన మంత్రి లోకేష్‌ను బర్తరఫ్‌ చేసి,డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగం నేతలు డిమాండ్‌ చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి,యువజన విభాగాల ఆధ్వర్యంలో సోమవారం పాడేరు కలెక్టరేట్‌ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డీఎస్సీ నిర్వహణ, ఫలితాల విడుదల, ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో అవకతకలు జరిగాయని, మెరిట్‌ అభ్యర్థులకు తీవ్ర నష్టంవాటిల్లిందని యువజన విభాగం నేతలు, ఉద్యోగార్థులు ఆరోపించారు. మంత్రి లోకేష్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని,డీఎస్సీలో అక్రమాలపై విచారణ చేయాలనే నినాదాలతో హోరెత్తించారు. ఆందోళన కార్యక్రమం అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు,అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,యువజన,విద్యార్థి విభాగం నేతలు కలెక్టర్‌ నిశాంతిని కలిపి డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య,జిల్లా అధ్యక్షుడు గబ్బాడ శేఖర్‌,విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లోచలి వరప్రసాద్‌,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి నాగభూషణం.వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్‌, జిల్లా నేతలు శెట్టి అప్పాలు,కమ్మిడి అశోక్‌,గండేరు చినసత్యం,కూడా సుబ్రహ్మణ్యం,గొడ్డేటి మహేష్‌,సందాడి కొండబాబు, పల్టాసింగి విజయ్‌కుమార్‌,అరకులోయ ఎంపీటీసీ దురియా ఆనంద్‌కుమార్‌, మాజీ వైస్‌ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌ సీదరి సాంబ,యువజన,విద్యార్థి విభాగం రాష్ట్ర,జిల్లా నాయ కులు అచ్యుత్‌, సాగర్‌,యేషన్‌, వీరన్నపడాల్‌, అన్ని మండలాల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో పాడేరు,అరకులోయ ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు,రేగం మత్స్యలింగం,యువజన,విద్యార్థి విభాగం నాయకులు

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు,రేగం మత్స్యలింగం,యువజన,విద్యార్థి విభాగం నాయకులు

బుడతలవేనం రహదారిని బాగుచేయాలి

6 నుంచి ఇంటర్మీడియెట్‌ తరగతులు

జి.మాడుగుల: గురుకుల కళాశాలలో ప్రవేశాలు పొందిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 6వ తేదీ నుంచి తరగతులు నిర్వహించనున్నట్టు గురుకుల కన్వీనర్‌ యండమూరి పారయ్య తెలిపారు. ముందుగా ఈనెల 1న హాజరుకావాలని తెలియజేసినప్పటికీ ఇంటర్మీయెట్‌ బోర్డు ఆదేశానుసారం 6న కళాశాలలు పునఃప్రారంభమవుతాయన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులతో పాటు ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఆరోజు నుంచే హాజరుకావాలని ఆయన సూచించారు.

నిరుద్యోగుల జీవితాలతో ఆటలా

చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీలో అవినీతి అక్రమాలకు పాల్పడి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడింది.రూ.15 లక్షల నుంచి రూ.20లక్షలకు టీచర్‌ పోస్టులు అమ్ముకున్న మంత్రి లోకేష్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడంతో పాటు మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలి.అన్యాయానికి గురైన నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టులిచ్చి న్యాయం చేయాలి.

– గబ్బాడ శేఖర్‌, జిల్లా అధ్యక్షుడు,

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం

అర్హులకు అన్యాయం

చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి అర్హులైన వారికి అన్యాయం చేసింది.మెగా డీఎస్సీలో టీచర్‌ పోస్టులను అమ్ముకున్న కూటమి ప్రభుత్వం,మంత్రి నారా లోకేష్‌లపై సీబీఐతో విచారణ జరపాలి.గిరిజన ప్రాంతాల్లోని టీచర్‌ పోస్టులను అమ్ముకున్నారనే ఆందోళన కూడా గిరిజన అభ్యర్థుల్లో నెలకొంది.

– లోచలి వరప్రసాద్‌, జిల్లా అధ్యక్షుడు,

వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం

విచారణ జరపాలి

ఉపాధ్యాయ పోస్టులను అమ్ముకున్న చంద్రబాబు ప్రభుత్వం,మంత్రి లోకేష్‌ అక్రమాలపై వెంటనే న్యాయ విచారణ జరపాలి.స్పోర్ట్స్‌తో పాటు పలు కోటాల కింద అనర్హులకు ఉపాధ్యాయ పోస్టులను రూ.లక్షల్లో అమ్ముకోవడం అన్యాయం.డీఎస్సీలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి. లోకేష్‌ను మంత్రి పదవి నుంచి తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుంది.

– మజ్జి నాగభూషణం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం

Advertisement
 
Advertisement
Advertisement