● అడుగంటిన నీటిమట్టాలు
● మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఉత్పత్తిపై ప్రభావం
నీటి నిల్వలు తక్కువగా ఉన్న జోలాపుట్టు జలాశయం
పూర్తిగా అడుగంటిన జోలాపుట్టు స్పిల్‌వే జలాశయం
ముంచంగిపుట్టు: ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి ప్రధాన ఆధారమైన డుడుమ, జోలాపుట్టు జలాశయా ల్లో ఈ ఏడాది నీటి నిల్వలు భారీగా పడిపోయాయి. నిత్యం జలకళతో కలకలలాడే ఈ జలాశయాలు, ప్ర స్తుతం నీరు లేక వెలవెలబోతూ దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా జోలాపుట్టులో ఉన్న ఒడిశా పరిధిలోని స్పిల్‌వే జలాశయం పూర్తిగా అడుగంటిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిధిలోని జలాశయంలో మా త్రమే కొంతమేర నీటి నిల్వలు ఉన్నాయి. జోలాపుట్టు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2,750 అడుగులు కాగా.. శుక్రవారం నాటికి అది 2,707 అడుగులుగా నమోదైంది. గత ఏడాది ఇదే రోజున ఇక్కడ నీటి మట్టం 2,729 అడుగులుగా ఉండటం గమనార్హం. అంటే గత ఏడాదితో పోల్చితే ఈసారి ఏకంగా 22 అడుగుల నీటి నిల్వ తక్కువగా ఉంది. మరోవైపు, డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2,590 అడుగులు కాగా.. ప్రస్తుతం అక్కడ 2,582 అడుగుల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఎండ తీవ్రత పెరగడం, ఎగువ నుంచి ఇన్–ఫ్లో తగ్గడంతో నీటి మట్టాలు వేగంగా పడిపోతుండటం పట్ల అధికారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


