● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వినూత్నంగా స్పందించారు. శుక్రవారం ఆయన తన సొంత వాహనాన్ని పక్కన పెట్టి, అరకులోయ నుంచి హుకుంపేట వరకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో సామాన్య ప్రయాణికుడిలా ప్రయాణించారు. మార్గమధ్యంలో బస్సులోని ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తుతున్న తరుణంలో ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజలంతా ప్రజారవాణాను ఉపయోగించుకోవాలని, అత్యవసరమైతేనే సొంత వాహనాలను రోడ్డుపైకి తీయాలని ఆయన కోరారు.


