వడదెబ్బకు గురికాకుండా తగిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు గురికాకుండా తగిన చర్యలు

May 23 2026 1:22 AM | Updated on May 23 2026 1:22 AM

బుచ్చెయ్యపేట: తీవ్ర ఎండల దృష్ట్యా ఏ గ్రామంలోనూ ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి డీఎంహెచ్‌వో హైమావతి ఆదేశించారు. శుక్రవారం ఆమె వడ్డాది మేజర్‌ పంచాయతీలోని ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించారు. ఇక్కడ రికార్డులను, రోగుల వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డు(ఈహెచ్‌ఆర్‌), అభయకార్డుల నమోదు తీరును పరిశీలించారు. గ్రామాల్లో వడదెబ్బకు గురికాకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే తక్షణ వైద్య సేవలు అందించాలని సూచించారు. ల్యాబ్‌ను, మందులు, పేషెంట్లు గదులను తనిఖీ చేశారు. డాక్టర్‌ మాధవి, ఎంపీహెచ్‌ఓ మోజేష్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ శ్రీను పాల్గొన్నారు.

డీఎంహెచ్‌వో హైమావతి

Advertisement
 
Advertisement
Advertisement