అల్లిపురం: హనీ ట్రాప్ పేరుతో ఆన్‌లైన్ మోసా లకు పాల్పడుతున్న నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించా రు. ఆర్థిక ఇబ్బందులు, ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ అలవాటు కారణంగా త్వరగా డబ్బు సంపాదించాలని భావించిన నిందితుడు అన్నపురెడ్డి సాంబశివరావు ‘సంధ్యారాణి’, ‘కావ్య’ పేర్లతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను సృష్టించాడు. విశాఖపట్నా నికి చెందిన 62 ఏళ్ల వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్న నిందితుడు మాయమాటలు చెప్పి తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని నమ్మించి, దశలవారీగా రూ.5.20 లక్షలను తన ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. ఆ డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్‌కు వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సాంకేతిక ఆధారాలు, బ్యాంక్ లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని హైదరాబాద్‌లోని బోడుప్పల్, ఫిర్జాదిగూడకు చెందిన సాంబశివరావుగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


