చింతపల్లి: ఆంధ్రా కాశ్మీర్‌గా పేరొందిన లంబసింగిలో శ్రీ రాకాసమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగుతాయని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.మూడు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను, భక్తుల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ తీర్థ మహోత్సవాలకు మన్యం ప్రాంతం నుంచే కాకుండా మైదాన ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై, జాతరను జయప్రదం చేయాలని వారు కోరారు.


