ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనాథ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనాథ్‌

May 22 2026 12:24 AM | Updated on May 22 2026 12:24 AM

పాడేరు రూరల్‌: ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనాథ్‌ శ్రీను ఎన్నికవ్వడం పట్ల ఆ సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నూతనంగా నిర్వహించిన ఆర్యవైశ్య కుల సంఘం ఎన్నికల్లో, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాపై నమ్మకంతో ఈ జిల్లా బాధ్యతలను అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పదవి ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందని, జిల్లాలోని ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి ఇకపై మరింత కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తన ఎన్నికకు సహకరించిన పెద్దలకు, సంఘ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement