పోరాటంలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

పోరాటంలో భాగస్వాములు కావాలి

May 22 2026 12:24 AM | Updated on May 22 2026 12:24 AM

ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ పిలువు

చింతపల్లి: విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఇఈయూ) నాయకులు సత్యనారాయణ కోరారు. గురువారం చింతపల్లి సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లకు ఆయన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ సంస్థలో పని చేస్తున్న ఆపరేటర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారం కోసం నిరంతర ఉద్యమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. హక్కుల సాధనకై సాగే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లాలో నూతనంగా జరగబోయే తొలి మహాసభలను అందరూ విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు జి.సత్యనారాయణ, చంద్రశేఖర్‌, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement