తీరంలో వేసవి సందడి | - | Sakshi
Sakshi News home page

తీరంలో వేసవి సందడి

May 21 2026 1:53 AM | Updated on May 21 2026 1:53 AM

పరవాడ: మండుతున్న ఎండలతో పాటు వీపరీతంగా వీస్తున్న వడగాల్పులకు మండల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు, ఉక్కపోతతో గ్రామీణ ప్రజలు ఉడుకెత్తిపోతున్నారు. ఓ పక్క తరచూ విద్యుత్‌ కోతలను అమలు చేస్తుండటంతో ప్రజలు ఇంట్లో ఉండలేని పరిస్థితులతో విసుగెత్తిపోతున్నారు. దీంతో మండల ప్రజలు పిల్లాపాపలతో ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం తీర ప్రాంతాలకు తరలి వెళ్లి సేదదీరుతున్నారు. సముద్రంలో స్నానాలు చేస్తూ ఉపశమనం పొందుతున్నారు. అగ్నికార్తెల ఆరంభంతో ప్రారంభమైన వేడిగాలులు ఈ నెలాఖరు వరకు కొనసాగుతాయన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement