3 చేపల బోట్లపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

3 చేపల బోట్లపై కేసు నమోదు

May 21 2026 1:53 AM | Updated on May 21 2026 1:53 AM

● నిషేధ సమయంలో వేటకు వెళ్తే లైసెన్స్‌లు రద్దు ● మత్స్యకారులను హెచ్చరించిన ఎఫ్‌డీవో

ఎస్‌.రాయవరం: వేట నిషేధం సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళితే బోటు లైసెన్స్‌ రద్దు చేసి రాయితీలు ఉపసంహరించం జరుగుతుందని నక్కపల్లి ఎఫ్‌డీవో శృతి హెచ్చరించారు. బంగారమ్మపాలెం మొగ నుంచి గడిచిన కొన్ని రోజులుగా రేవుపోలవరం గ్రామానికి చెందిన మత్స్యకారులు రహస్యంగా చేపల వేటకు వెళుతున్నట్టు గుర్తించామన్నారు. మంగళవారం రాత్రి చేపల వేటకు వెళ్లి తిరిగి వచ్చిన 3 బోట్లను గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. వేట చేసి తీసుకువచ్చిన చేపలను ఎగుమతులకు పాల్పడిన వాహన దారులపై కూడా కేసులు నమోదు చేశామన్నారు. వేట నిషేధ ప్రకటించాక ఇప్పటి వరకు 18 బోట్లపై కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పుడు వాటి రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తే ఆ యజమానులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ రాయితీలు వర్తించవని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement