జగన్‌మోహన్‌రెడ్డితో జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
ముంచంగిపుట్టు: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలో ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర బుధవారం కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. పార్టీ అధ్యక్షుడు తమకు ఎంతో విలువైన సమయం కేటాయించి, మాట్లాడడం సంతోషాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు.


