విద్యుత్‌ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

May 21 2026 1:53 AM | Updated on May 21 2026 1:53 AM

అనకాపల్లి: ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) ద్వారా విద్యుత్‌బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ డిపో అధ్యక్షుడు కె.ఎన్‌.రమేష్‌ డిమాండ్‌ చేశారు. అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక డిపో గేటు వద్ద బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి, నిర్వహించాలన్నారు. సీ్త్ర శక్తి బస్సుల్లో జీరో టికెట్లు ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేసి, మిగతా ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, సిబ్బందిపై పనిభారం తగ్గించాలని, కొత్త పీఆర్సీ కమిటీని నియమించి, ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని,పెండింగ్‌లో ఉన్న డీఏలు, అరియర్స్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ రీజనల్‌ కార్యదర్శి పి.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement