తృప్తి క్యాంటీన్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

తృప్తి క్యాంటీన్‌ ప్రారంభం

May 21 2026 1:53 AM | Updated on May 21 2026 1:53 AM

నర్సీపట్నం: మెప్మా ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్‌ను స్పీకర్‌ సీహెచ్‌.అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించేలా 750 తృప్తి క్యాంటీన్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ మంజూరు చేసిన రూ.13.75 లక్షల ఆర్థిక సాయంతో మెప్మా ఆధ్వర్యంలో ఫుడ్‌ కోర్ట్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జిల్లాలో మొట్ట మొదట క్యాంటీన్‌ ఇదే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి.వి.రమణ, మున్సిపల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర, బ్యాంకు మేనేజర్‌ నాగరాజు, మెప్మా డీపీఎంయూటీఈ సందీప్‌, డీఆర్సీ రాజశేఖర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గవిరెడ్డి వెంకటరమణ, టిడిపి పట్టణ అధ్యక్షులు సీహెచ్‌.రాజేష్‌,మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి, జెడ్పీటీసీ సుకల రమణమ్మ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement