పాడేరు ఎమ్మెల్యేపై తప్పుడుఆరోపణలు తగదు | - | Sakshi
Sakshi News home page

పాడేరు ఎమ్మెల్యేపై తప్పుడుఆరోపణలు తగదు

May 20 2026 1:40 AM | Updated on May 20 2026 1:40 AM

దాడికి పాల్పడిన వారిని

కఠినగా శిక్షించాలి

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అచ్యుత్‌

కొయ్యూరు: బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టడం టీడీపీ నాయకులకు అల వాటుగా మారిందని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి. అచ్యుత్‌ ఆరోపించారు. పాస్టర్‌ అభినయ్‌పై జరిగిన దాడికి, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు కూటమి నాయకులు ముడిపెట్టాలని చూడడం దారుణమన్నారు. ఎమ్మెల్యేనే ఈ దాడి చేయించారని తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆయన మంగళవారం తెలిపారు. అభినయ్‌ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారని, అవి కూటమి నాయకులకే వర్తిస్తాయన్నారు. ఈ నేపథ్యంలో వారే అభినయ్‌పై శతృత్వం పెంచుకుని ఉండే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే దాడి చేయించారని ప్రచారం చేయడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అభినయ్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement