డుంబ్రిగుడ: మండు వేసవిలోనూ చాపరాయి అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ వి.అభిషేక్ అన్నారు. సోమవారం ఆయన చాపరాయిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను పాడేరు ఐటీడీఏ పీవోగా విధులు నిర్వహించిన సమయంలో చాపరాయి అభివృద్ధికి సుమారు రూ.80 లక్షలు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చాపరాయి జలపాతం గిరిజన ప్రాంతంలో మినీ బీచ్ లాంటిదని, మద్రాసులో మెరీనా బీచ్, విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్‌లుఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయో చాపరాయి జలపాతం కూడా అంతే ప్రాముఖ్యత పొందిందని చెప్పారు. అనంతరం చాపరాయి ఉద్యోగులు, వ్యాపారులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు.


