పాడేరు : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుని ప్రశాంతమైన జీవితం గడపాలని కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. పట్టణంలో మోదకొండమ్మ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో స్థానిక మోదకొండమ్మ ఓపెన్ ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ప్రదర్శనను జ్యోతి ప్రజల్వన చేసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 108 శివలింగాలను ఒకేచోట కొలవుదీర్చడం గొప్ప విషయమన్నారు. అనంతరం ఆధ్యాత్మిక విజ్ఞాన చిత్రప్రదర్శనను ఆమె తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళలు, సాంస్కృతిక అకడామీ చైర్మన్ వంపూరి గంగులయ్య, పోలవరం ప్రాజెక్టు అధికారి అభిషేక్, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.


