డుంబ్రిగుడ: మహిళలు ఎ క్కువ మంది పిల్లల్ని కనాల ని ముఖ్యమంత్రి చంద్రబా బు చెప్పడం తగదని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్‌ఎంపీపీ శెట్టి ఆనంద్‌రావు మండిపడ్డారు. సోమవారం వారు మాట్లాడుతూ మీరు మాత్రం ఒక్క లోకేష్, మీ కుమారుడు ఒక్క దేవాన్ష్‌నే కంటారు, ప్రజలకు మాత్రం ఉపన్యాసాలు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరిగిన ధరలు, నిరుద్యోగ సమస్య, కుటుంబ పోషణ భారం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాజీ ఎంపీటీసీ తాంగుల రాందాసు, తుమ్నాథ్ పాల్గొన్నారు.


