దేవరాపల్లి: భగవాన్ సత్యసాయి బాబా చూపిన ఆధ్యాత్మిక, ప్రేమ, సేవా మార్గం అనుసరణీయమని సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త తోట అరుణ తెలిపారు. మండలంలోని చిననందిపల్లిలో భగవాన్ సత్యసాయి నామస్మరణం మారుమోగింది. సోమవారం ఇక్కడ నిర్వహించిన 101 పాటల భజన కార్యక్రమంతో ఆధ్యాత్మిక శోభ సంతరించరించుకుంది. సత్యసాయి భజన మండలి జోన్–6 ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త తోట అరుణ చేసిన ఆధ్యాత్మిక ఉపన్యాసం భక్తులను పులకరింపజేసింది. ఈ కార్యక్రమంలో జోన్ ఇంచార్జ్ సిహెచ్‌వి. రవిశంకర్, నౌడు అప్పారావు మాష్టారు, కొటాన శ్రీను, పద్మ దంపతులు, భవాని, సూర్య, భాస్కరరావు, కృష్ణ, అప్పారావు, కొరుకొండ పెంటారావు, స్వామినాయుడు, రామకృష్ణ, రమణమూర్తి, రమామణి తదితర మహిళా సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త తోట అరుణ


