ఏజెన్సీ అభివృద్ధి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చలవే | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీ అభివృద్ధి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చలవే

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

● పథకాల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలం ● మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

సీలేరు: తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన చందబ్రాబు ప్రభుత్వం పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి విమర్శించారు. గురువారం సీలేరు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలన్నీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలువుతో అభివృద్ధి చెందాయన్నారు. కూటమి ప్రభుత్వం గెలిచి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు కాలేదన్నారు. ప్రస్తుతం పాడేరు నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జాడలేదని, నిధులు లేక అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని చెప్పారు. ముఖ్యంగా గిరిజనులకు తాగునీరు, సాగునీరు, విద్యా, వైద్యం అందకుండా పూర్తిగా గాడి తప్పిందన్నారు. ఇది ప్రభుత్వ తప్పదమేనని ఆమె ఆక్షేపించారు. 2029 ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారన్నారు.

మారెమ్మతల్లి సన్నిధిలో పూజలు

దారకొండ గ్రామంలో జరిగిన పార్టీ గూడెం కొత్త వీధి మండలం బీసీ సెల్‌ అధ్యక్షుడు పిల్లా బుజ్జి కుమార్తె వివాహ వేడుకల్లో భాగ్యలక్ష్మితో పాటు ఎంపీపీ కుమారి, బొబ్బిలి లక్ష్మణ్‌, రామకృష్ణ, చింతపల్లి ఎంపీపీ అనుష్క, పలువురు మండల నాయకులు పాల్గొన్నారు. వీరంతా గ్రామ దేవత ధారాలమ్మ, మారెమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement