కరాటేలో గిరిజనుడికి బ్లాక్‌ బెల్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కరాటేలో గిరిజనుడికి బ్లాక్‌ బెల్ట్‌

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

ముంచంగిపుట్టు: మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ సరియాపుట్టు గ్రామానికి చెందిన గిరిజన యువకుడు కరాటేలో ప్రతిభ చూపాడు. గత నెల 26న హైదరాబద్‌లో జరిగిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ఈవెంట్‌లో సరియాపుట్టుకు చెందిన కె.చంద్రకాంత్‌పడాల్‌ పాల్గొని బెల్ట్‌ గ్రేడింగ్‌ మెరిట్‌ ద్వారా బ్లాక్‌ బెల్ట్‌ను సాధించాడు. నిర్వహణ చీఫ్‌ ఎగ్జిమినార్‌ రవి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నాడు. గిరిజన యువకుడి ప్రతిభను మెచ్చుకొని కరాటే లెజెండ్‌, సినీనటుడు సుమన్‌ ప్రతిభ సర్టిఫికెట్‌ను చంద్రకాత్‌పడాల్‌కు అందించారు. కరాటే మాస్టర్‌ రాజేష్‌, తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహంతోనే బ్లాక్‌ బెల్ట్‌ను సాధించానని పడాల్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement