పాడేరు రూరల్: ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జి సెంటర్(జేకేసీ), సీఎంఎస్ లేబొరేటరీ విశాఖ వారి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. 2025 సంవత్సరంలో డిగ్రీ ఉత్తీర్ణులైన బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థులు 65 మంది ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అపోలో టైర్స్, హెచ్‌డీఎఫ్ బ్యాంక్, లీ ఫార్మా లిమిటెడ్, జేఎన్‌ఎఫ్ లిమిటెడ్, ఎంఎస్‌ఎన్ లేబొరేటరీ, సీఎంఎస్ లేబొరేటరీ, తదితర కంపెనీలు నిర్వహించిన జాబ్‌మేళాలో 25 మంది విద్యార్థులు ఆయా కంపెనీల్లో ఉద్యో గాలు సాధించారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ రసూల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యూ ఏసీ కో–ఆర్డినేటర్ పి.కోటేశ్వరరావు, కళాశాల అధ్యాపక సిబ్బంది జానకిరాం, గౌరీశంకర్, దామోదర్‌రావు, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.


