చెక్‌డ్యాంల మరమ్మతులకు ప్రతిపాదనలు | - | Sakshi
Sakshi News home page

చెక్‌డ్యాంల మరమ్మతులకు ప్రతిపాదనలు

Apr 7 2026 8:01 AM | Updated on Apr 7 2026 8:01 AM

డీడబ్ల్యూఆర్‌వో రామచంద్రరావు

కొయ్యూరు: భూ గర్భ జలాల పెంపునకు వీలుగా చెక్‌డ్యాం, జలాశయాలకు మరమ్మతులు చేయడంతో పాటు పూడిక తీయించేందుకు చర్యలు చేపడుతున్న ట్టు దవళేశ్వరం నీటిపారుదల శాఖ లిఫ్ట్‌ డిజైన్‌ పర్యవేక్షక ఇంజనీర్‌(ఎస్‌ఈ), అల్లూరి జిల్లా నీటివనరుల అధికారి(డీడబ్ల్యూఆర్‌వో) వి.రామచంద్రరావు తెలిపారు.భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవా లని సూచిస్తూ ప్రభుత్వం ఈ జిల్లాకు బాధ్యతలను తనకు అప్పగించిందని ఆయన తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నీటి వినియోగదారుల సంఘాల సభ్యులతో ఎంపీపీ బడుగు రమేష్‌ కుమార్‌ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెక్‌డ్యాంల మరమ్మతులు, జలాశయాల్లో పూడిక తీయించేందుకు నిధుల కోసం త్వరలో కలెక్టర్‌కు ప్రతిపాదిస్తామన్నారు. నిధులు విడుదలైన 80 రోజుల్లో పనులు పూర్తి చేయిస్తామని తెలిపారు. ఎంపీపీ రమేష్‌ మాట్లాడుతూ కించవానిపాలెం జలాశయంలో పేరుకుపోయిన పూడికను తీయించాలని కో రారు. నీటిపారుదల శాఖ జేఈ రామకృష్ణ మాట్లాడు తూ చెక్‌డ్యాంలు,జలాశయాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేస్తామన్నారు. ఎంపీడీవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement