సీలేరు: దారాలమ్మ తల్లి ఘాట్ రోడ్డు నుంచి అంతర్రాష్టాలకు వెళ్లే రహదారి మృత్యుపాశంగా మారింది. ఈ మార్గంలో పలుచోట్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొనడంతో నిత్యం ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
నిలిచిపోయిన పనులు : చింతపల్లి ఆర్‌అండ్‌బీ డివిజన్ పరిధిలోని ఆర్‌వీ నగర్ నుంచి సీలేరు మీదుగా పాలెడ్డ వరకు రహదారి పనులు ప్రారంభించి ఐదు నెలలు గడుస్తున్నా నేటికీ పనులు మొదలుకాలేదు. దీనివల్ల ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళితో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.
ప్రమాదకరంగా గొయ్యి : సీలేరు సమీపంలోని ఐస్‌గెడ్డ జలపాతం వద్ద రోడ్డు అంచు భారీగా కోతకు గురై పెద్ద గొయ్యి పడింది. ఏడాదిన్నర క్రితం సంభవించిన ప్రకృతి విపత్తు వల్ల కొండచరియలు విరిగిపడి, సుమారు 30 అడుగుల మేర రోడ్డు కుంగిపోయింది. ఇంతటి ప్రమాదకర స్థితిలో రహదారి ఉన్నా, సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘాట్ రోడ్డులో ప్రయాణం ప్రాణసంకటంగా మారిందని, ఇప్పటికై నా అధికారులు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఆ గోతిని పూడ్చి, పెండింగ్‌లో ఉన్న రహదారి పనులను పూర్తి చేయాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు


