ఇఫ్తార్ సహర్
శుక్ర శని
అరకు 6.07 5.09 పాడేరు 6.06 5.08
పొగమంచుతోఉక్కిరిబిక్కిరి
● అరుకులోయలో 11.0 డిగ్రీలు
కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
చింతపల్లి: అల్లూరి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ పొగమంచు తీవ్రత యధావిధిగానే కొనసాగుతోంది. అరుకులోయలో 11.0 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 12.8 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోదన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగ నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో పెదబయలులో 13.4 డిగ్రీలు, చింతపల్లిలో 13.5 డిగ్రీలు, కొయ్యూరులో 15.3 డిగ్రీలు, జి మాడుగులలో 16.0 డిగ్రీలు, అనంతగిరిలో 17.0 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఏడీఆర్ తెలిపారు.
ఇఫ్తార్ సహర్


