రహదారి నిర్మాణంపైస్థలం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

రహదారి నిర్మాణంపైస్థలం పరిశీలన

Feb 20 2026 6:50 AM | Updated on Feb 20 2026 6:50 AM

రహదారి నిర్మాణంపైస్థలం పరిశీలన

రహదారి నిర్మాణంపైస్థలం పరిశీలన

గూడెంకొత్తవీధి: మండలం దేవరాపల్లి పంచాయతీలోని ఎలుగురాతిబంద గ్రామంలో రహదారి నిర్మాణ పనులను గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ ఈఈ డేవిడ్‌రాజ్‌ గురువారం డీఈ రఘుతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం ఇటీవల ఆ గ్రామానికి రూ.2కోట్లతో రహదారిని మంజూరు చేసింది. అయితే తాము సూచించిన మార్గం ద్వారా రహదారిని నిర్మించాలని గ్రామస్తులు పట్టుబట్టారు. ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో కలెక్టర్‌ అధికారులను విచారణకు ఆదేశించారు. దీంతో గురువారం ఇంజినీరింగ్‌ అధికారులు ఎలుగురాతి బంద గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.సర్పంచ్‌ సిరిబాల బుజ్జిబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement