మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Feb 20 2026 6:50 AM | Updated on Feb 20 2026 6:50 AM

మహిళల

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

పాడేరు రూరల్‌: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, బాల్య వివాహాలు అరికట్టాలని పాడేరు డీఎస్పీ పి.అభిషేక్‌ తెలిపారు. పోలీస్‌ శాఖ, ఐటీడీఎస్‌ సంయుక్తంగా స్థానిక పోలీసు కంట్రోల్‌ రూమ్‌ వద్ద గురువారం అంగన్‌వాడీలు, వివిధ మహిళ సంఘాలతో మహిళల భధ్రత, హక్కులు చట్టాలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు డీఎస్పీ పి.అభిషేక్‌ మాట్లాడుతూ మహిళల భద్రత పటిష్టంగా అమలుకు అందరూ సహకరించాలన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. పౌష్టికాహారం లోపంతో మరణాలు జరుగుతున్నాయన్నారు. వీటిని అరికట్టేందుకు అందరూ తమ వంతు కృషి చేయాలన్నారు. మూఢనమ్మకాలను వీడి సమాజ మార్పుకు అందరూ పనిచేయాలన్నారు. మహిళలపై వేధింపులు, దాడులు, వివిధ రకాల సైబర్‌ నేరాలు జరగకుండా ప్రత్యామ్నాయంగా పోలీసు శాఖ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళ హక్కులు చట్టాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లో మహిళలు ఆత్మ రక్షణ కోసం హెల్పలైన్‌ 181, శక్తియాప్‌ 112 నంబర్లకు సంప్రదించాలన్నారు. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమలు నిర్వహిస్తు చైతన్యపరుస్తున్నమన్నారు. అందరూ సహకారంతోనే మంచి సమాజాన్ని ఏరాటు చేసుకోగలమన్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవుపలికారు. గంజాయి, డ్రగ్స్‌, మద్యం జోలికి వెళ్లొద్దన్నారు. మంచి చదువుతోనే బంగారు భవిషత్‌ ఉంటుందని చెప్పారు. ఐటీడీఎస్‌ పీడి ఝాన్సీ, వైద్య నిపుణులు డాక్టర్‌ రాజు, సీడీపీవో శారద, ఎన్‌ఐసిఈ ఎన్‌డీవో కౌన్సిలర్‌ శాంతి, సీఐ దీనబంధు, ఎస్‌ఐ పాపినాయుడు పాల్గొన్నారు.

పాడేరు డీఎస్పీ అభిషేక్‌

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి1
1/1

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement