గంజాయితో పట్టుబడిన నలుగురిపై కేసు
డుంబ్రిగుడ: గంజాయికి బానిసలై బహిరంగా ప్రదేశాల్లో సేవిస్తూ పట్టుబడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎల్.సురేష్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని బోందుగుడ జంక్షన్‌లో నలుగురు వ్యక్తులు బుధవారం ఒక ఆటో వద్ద గంజాయి సేవిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి వారిని అదుపులో తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదుచేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఆటోను సీజ్ చేసి గంజాయి మత్తు నుంచి విముక్తి పొందేలా వారికి జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మత్తు విముక్తి కేంద్రానికి తరలించామన్నారు.


