దేవీతల్లి తీర్థ మహోత్సవాలు ప్రారంభం
దేవరాపల్లిలో దేవీతల్లి దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం
దేవరాపల్లి: స్థానిక ఉమామహేశ్వరీదేవి(దేవీతల్లి) కళ్యాణ, తీర్థ మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల తీర్థ మహోత్సవాల్లో తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కుంకుమ పూజలు, రుద్రాభిషేకాలు చేశారు. తెల్లవారుజాము నుంచి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. రాత్రికి అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కనుల వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ వైభోగాన్ని భక్తులు కనులారా చూసి తరించారు. ఆలయ పరిసరాలలో ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


