భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు
ముంచంగిపుట్టు: యువత మత్తుకు బానిసలై భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు హితవు పలికారు. మండల కేంద్రంలో మంగళవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనార్థాలు, రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గిరిజనులతో ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం వనభసింగి పంచాయతీ లుంగాపుట్టులో గిరిజన యువతకు వాలీబాల్ కిట్లు అందించారు. గ్రామంలో సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత భవిష్యత్తును చీకటి చేస్తున్న డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని,మత్తులో విచక్షణ కోల్పోయి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు అఘాత్యాలకు పాల్పడుతున్నారన్నారు. గంజాయి రవాణా, సాగు చేయడం వల్ల చాలా మంది జీవితాలు జైలు పాలవుతున్నాయని, వాహనదారులు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ పి.నాని, పోలీసులు, గిరిజనులు పాల్గొన్నారు.


