‘జనసేన నుంచి సూర్యచంద్రను తప్పించాలి’
నర్సీపట్నం: జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి రాజాన వీర సూర్యచంద్రను తప్పించి, సస్పెండ్ చేయాలని జనసేన వీరమహిళ, కౌన్సిలర్ అద్దెపల్లి సౌజన్య పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. సూర్యచంద్రను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆందోళన చేపట్టారు. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఇన్‌చార్జిని బాధ్యతల నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యచంద్ర వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. పార్టీ కార్యాలయంలో మద్యం సేవించటం, మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటం వల్ల పార్టీకి తలవంపు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ టౌన్ అధ్యక్షుడు అద్దెపల్లి గణేష్, తదితరులు పాల్గొన్నారు.


