రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం
● పీఆర్ ఏఈఈ మురళీకృష్ణ
మజ్జిగూడ రహదారి పనుల్లో నాణ్యతను
పరిశీలిస్తున్న పీఆర్ ఏఈఈ మురళీకృష్ణ
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాలకు నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పీఆర్ ఏఈఈ మురళీకృష్ణ అన్నారు. మండలంలోని ఏనుగురాయి పంచాయతీ మజ్జిగూడ గ్రామానికి నూతనంగా నిర్మిస్తున్న రహదారి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రహదారుల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పనులు జరుగుతున్నాయని తెలిపారు. మజ్జిగూడ, దొమినిపుట్టు, కోడాపుట్టు గ్రామాలకు బీటీ రోడ్డు పనులు పూర్తి చేశామన్నారు. రహదారులు, వంతెనలు లేని గ్రామాలకు వాటిని నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆయన పేర్కొన్నారు.


