ఎంఎస్‌ఎంఈ కంపెనీలకు సబ్సిడీ రుణాలు
అనకాపల్లి: ఎంఎస్‌ఎంఈ కంపెనీలకు ఆర్‌బీఐ ఆధ్వర్యంలో సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తామని ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ రాజేష్‌కుమార్ మహానా తెలిపారు. స్థానిక మెయిన్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎంఎస్‌ఎంఈ కంపెనీ ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌బీఐ, బ్యాంకింగ్, ఆర్థిక సమావేశ పథకాలపై అవగాహన కల్పించారు. రుణ సదుపాయాలు ఎలా పొందాలో తెలియజేశారు. అనంతరం రాజేష్‌కుమార్ మహానాను జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ జి.ఈశ్వర్, డీఐసీ అనకాపల్లి జనరల్ మేనేజర్ ఆర్.ప్రసాద్, ఏపీ గ్రామీణ బ్యాంక్ ప్రతినిధి సతీష్ చంద్ర, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.


